నృపా విమోచకా ప్రభూ – వేలాది నోళ్ల నీ
గృపా జయప్రభావముల్ – నుతింతు నెంతయున్
కృపాధికార దేవ నీ సాయంబు జేయుమా
భవత్ర్వభావ కీర్తులన్ – జాటంగ నెల్లడన్
భయంబు చింతబావును – హర్షంబు పాపికి
సౌఖ్యంబు జీవశాంతులు – నీనామ మిచ్చును
విముక్తి జేయు ఖైదిని – పాపంబు బావును
పాపాత్ము శుద్ధిచేయును శ్రీ యేసు రక్తము
జనాళి పాపు లెల్లరు – శ్రీ యేసున్ నమ్ముడి
కృపా విముక్తులందరు – నంపూర్ణ భక్తితో
అర్పించె యేసు ప్రాణమున్ – నరాళిగావను
యజ్ఞంబు దేవ గొఱ్ఱెపై – నఘంబు వేయుడి
సత్కీర్తి స్తోత్ర ప్రేమల – నభావ భూమిని
సర్వత్ర దేవుడొందుగా – సద్భక్తవాళిచే
Nrupaa vimoachakaa prabhoo – vaelaadhi noaLla nee
grupaa jayaprabhaavamul – nuthimthu nemthayun
krupaaDhikaara dhaeva nee saayMbu jaeyumaa
bhavathrvabhaava keerthulan – jaatMga nelladan
bhayMbu chiMthabaavunu – harShMbu paapiki
saukhyMbu jeevashaaMthulu – neenaama michchunu
vimukthi jaeyu khaidhini – paapMbu baavunu
paapaathmu shudhDhichaeyunu shree yaesu rakthamu
janaaLi paapu lellaru – shree yaesun nammudi
krupaa vimukthulMdharu – nMpoorNa bhakthithoa
arpiMche yaesu praaNamun – naraaLigaavanu
yajnymbu dhaeva goRRepai – naghmbu vaeyudi
sathkeerthi sthoathra praemala – nabhaava bhoomini
sarvathra dhaevudoMdhugaa – sadhbhakthavaaLichae