Okkokka ganta ఒక్కొక్క గంట

యేసూ నా ప్రభువా – నీ ప్రేమ లేకున్న
నా యాత్మ కేదియు – విశ్రాంతి నియ్యదు

ఒక్కొక్క గంట నేను – నిన్నాశించుకొందు
నీ యాశీర్వాదమిమ్ము – నా రక్షకా

యేసూ, రేబగళ్ళు – నాయొద్ద నుండుము
నాతో నీ వుండిన – ఏ భయముండదు

సుఖంబు బొందగా – నిన్నే యాశింతును
దుఃఖంబు నొందగా నీవే శరణ్యము

నీదు మార్గమందున – నే నడ్వనేర్పుము
నీ మాట చొప్పున – నన్నున్ దీవించుము

నిన్నే యాశింతును – యేసూ నా ప్రభువా
నీ వంటి వాడనై – నన్నుండ జేయుము


Yaesoo naa prabhuvaa – nee praema laekunn
naa yaathma kaedhiyu – vishraanthi niyyadhu

Okkokka ganta naenu – ninnaashinchukondhu
nee yaasheervaadhamimmu – naa rakshkaa

Yaesoo, raebagaLLu – naayodhdha nundumu
naathoa nee vundina – ae bhayamundadhu

Sukhambu bondhagaa – ninnae yaashinthunu
dhuhkhmbu nondhagaa neevae sharanyamu

Needhu maargamandhuna – nae nadvanaerpumu
nee maata choppuna – nannun dheevinchumu

Ninnae yaashinthunu – yaesoo naa prabhuvaa
nee vanti vaadanai – nannunda jaeyumu


Posted

in

by

Tags: