పాడెద దేవ నీ కృపలన్ నూతన గీతములన్
స్తోత్రము చెల్లింతున్(2) ఆ..ఆ..ఆ…(2)
భూమి పునాదులు వేయకముందే యేసులో చేసితివి
ప్రేమ పునాదులు వేసితివి బ్రోచితివి
ఈ దీనుని బ్రోచితివి ||పా||
ప్రవిమల రక్తము కలువరి సిలువలో కలునకు నిచ్చితివి
ప్రేమకృప మహదైశ్వర్యములతో పాపము తుడిచితివి
నా పాపము తుడిచితివి ||పా||
పాపము శాపము నరకపు వేదన మరి తొలగించితివి
అపరాధములచే చచ్చిన నన్ను థర బ్రతికించితివి
నన్ను బ్రతికించితివి ||పా||
దేవుని రాజ్యపు వారసుడనుగా క్రీస్తులో చేసితివి
చీకటి రాజ్యపు శక్తుల నుండి నను విడిపించితివి
చెరవిడిపించితివి ||పా||
ముద్రించితివి శుద్ధాత్మతో నను భద్రము చేసితివి
సత్యస్వరూపి నిత్యనివాసి సొత్తుగా చేసితివి
నీ సొత్తుగా చేసితివి ||పా||
అన్యుడనై నిన్ను ఎరుగక యున్నను ధన్యుని చేసితివి
ప్రియ పట్టణ పౌరుల సేవింపను వరముల నొసగితివి
కృప వరముల నొసగితివి ||పా||
Paadedha dhaeva nee krupalan noothana geethamulan
sthoathramu chellimthun(2) aa..aa..aa…(2)
bhoomi punaadhulu vaeyakamumdhae yaesuloa chaesithivi
praema punaadhulu vaesithivi broachithivi
ee dheenuni broachithivi ||paa||
pravimala rakthamu kaluvari siluvaloa kalunaku nichchithivi
praemakrupa mahadhaishvaryamulathoa paapamu thudichithivi
naa paapamu thudichithivi ||paa||
paapamu shaapamu narakapu vaedhana mari tholagimchithivi
aparaadhamulachae chachchina nannu Thara brathikimchithivi
nannu brathikimchithivi ||paa||
dhaevuni raajyapu vaarasudanugaa kreesthuloa chaesithivi
cheekati raajyapu shakthula numdi nanu vidipimchithivi
cheravidipimchithivi ||paa||
mudhrimchithivi shudhdhaathmathoa nanu bhadhramu chaesithivi
sathyasvaroopi nithyanivaasi soththugaa chaesithivi
nee soththugaa chaesithivi ||paa||
anyudanai ninnu erugaka yunnanu dhanyuni chaesithivi
priya pattana paurula saevimpanu varamula nosagithivi
krupa varamula nosagithivi ||paa||