Pavurama Sanghamupai పావురమా సంఘముపై

పావురమా సంఘముపై వ్రాలుమిదే జ్వాలలుగా (2)
హల్లెలూయా – హల్లేలూయా (2)

తొలకరి వానలు కురిసే ఫలభరితంబై వెలిసే (2)
కడవరి చినుకులు పడగా పొలములో (2)
ఫలియించెను దీవెనలే ||పావురమా||

అభిషేకాలంకృతమై అపవాదిని కూల్చెనులే (2)
సభకే జయమౌ ఉబికే జీవం (2)
ప్రబలెను ప్రభు హృదయములో ||పావురమా||

బలహీనతలో బలమా బహుమానములో మహిమా (2)
వెలిగే వరమా ఓ పావురమా (2)
దిగిరా దిగిరా త్వరగా ||పావురమా||

Paavuramaa Sanghamupai Vraalumide Jwaalalugaa (2)
Hallelooyaa – Hallelooyaa (2)

Tholakari Vaanalu Kurise – Phalabharithambai Velise (2)
Kadavari Chinukulu Padagaa Polamulo (2)
Phaliyinchenu Deevenale ||Pavurama||

Abhishekaalankruthamai – Apavaadini Koolchenule (2)
Sabhake Jayamou Ubike Jeevam (2)
Prabalenu Prabhu Hrudayamulo ||Pavurama||

Balaheenathalo Balamaa – Bahumaanamulo Mahimaa (2)
Velige Varamaa O Paavuramaa (2)
Digiraa Digiraa Thvaragaa ||Pavurama||


Posted

in

by

Tags: