Premaamruta dhaaralu ప్రేమామృతధారలు

ప్రేమామృతధారలు చిందించిన యేసుకు సమమెవరు
ఆ – ఆ – ఆ ప్రేమయె తానై నిలిచి – ప్రేమవాక్కులనే బలికి
ప్రేమతో ప్రాణము బెట్టి – ప్రేమనగరికి చనియె /ప్రేమా/

నిశ్చలమైన ప్రేమజీవికి – యిలలో తావేది
ప్రేమ ద్రోహులేగాని – ప్రియమున చేరరు వాని
చేరిన చెలికాడగురా ! – సమయమిదే పరుగిడరా ! /ప్రేమా/

యెంత ఘోరపాపాత్ములనైన – ప్రేమించునురారా
పాపభారముతో – రారా – పాదములపై బడరా
పాపుల రక్షకుడేసు – తప్పక నిను రక్షించున్ /ప్రేమా/

ఇంత గొప్ప రక్షణను – నిర్లక్షము చేసెదవేల
రక్షణ దినమిదియేరా – తక్షణమే కనుగొనరా
ఇదియే దేవుని వరము – ముదమారగ జేగొనుము /ప్రేమా/


Premaamruta dhaaralu chindina mana Yesuku samamevaru
aa – aa – aa premaye taanai nilachi – Premavaakkulane baliki
Premato praanamu betti – premanagariki chaniye.. / Prema/

Nischalamaina prema jeeviki – Ilalo taavedi
Prema drohule gaani – Priyamuna cheraru vaani
Cherina chelikaadaguraa – Samayamide parugidaraa.. /prema/

Yenta ghora paapaatmulanina – Preminchunu raara
Paapa bhaaramuto raara – Paadamulapai badaraa
Paapula rakshakudesu – Tappaka ninu rakshinchun /Prema/

Inta guppa rakshananu nirlakshyamu chesedavela
Rakshana dinamidiyera – Takshaname kanugonaraa
Idiye devuni varamu – Mudamaaraga Jegonumu / Prema/


Posted

in

by

Tags: