రారె చూతుము రాజసుతుడీ రేయి జనన మాయెను
రాజులకు రా – రాజు మెస్సియ – రాజితంబగు తేజమదిగో //రారె//
దూత గణములన్ – దేరి చూడరే – దైవ వాక్కులన్ – దెల్పగా
దేవుడే = మన దీనరూపున – ధరణి కరిగెనీ – దినమున //రారె//
కల్లగాదిది – కలయు గాదిది – గొల్ల బోయల – దర్శనం =
తెల్లగానదె – తేజరిల్లెడి – తారగాంచరె – త్వరగ రారే //రారె//
బాలు డడుగో – వేల సూర్యుల – బోలు సద్గుణ – శీలుడు =
బాల బాలికా = బాలవృద్ధుల నేల గల్గిన – నాధుడు //రారె//
యూదవంశము – నుద్ధరింప దా -వీదుపురమున – నుద్భవించె =
సదమలంబగు – మదిని గొల్చిన – సర్వ జనులకు సార్వభౌముడు //రారె//
Raare chootamu raajasutudi reyi jananamaayenu
Raajulaku ra-raju Messiya – Raajitambagu tejamadigo //Raare//
Doota ganamulan – deri choodare – daiva vaakkulan – delpaga
Devude = mana deenaroopuna – dharani karigenee – dinamuna //raare//
Kallagaadidi – Kalayu gaadidi – golla boyila – darsanam =
Tellagaanade – tejarilledi – Taaragaanchare – twaraga raare //raare//
Baaludadugo – vela suryula -bolu sadguna -seeludu =
Baala baalikaa = Baalavrudhhula nela galgina – naadhudu //Raare//
Yudavamshamu – nuddharimpa daa-veedupuramuna
nudbhavinche = Sadamalambagu – madini golchina
sarvajanulaku saarvabhoumudu //raare//