రండో రారండో యేసుని చూడగను
రండో రారండో ప్రభుయేసుని చేరగను
పరమును విడిచి దివికి వచ్చి లోకాన్ని రక్షించెను
పశువుల తొట్టిలో దీనుడై మనలను హెచ్చించెను
ఆరాధిద్దామా ఆనందిద్దామా
ఆర్భాటిద్దామా యేసుని అనుసరిద్దామా
భువిలోన ప్రతిమనిషి రక్షణ కోసం
కనులెత్తి ఆకాశం చూస్తుండగా
అక్కడుంది ఇక్కడుంది రక్షణ అంటూ
పరుగెత్తి పరుగెత్తి అలసియుండగా
లోకాన్ని రక్షింప పసిబాలుడై
మనమధ్య నివసించెను
మార్గం యేసయ్యే సత్యం యేసయ్యే
జీవం యేసయ్యే నా సర్వం యేసయ్యే
గురిలేని బ్రతుకులో గమ్యం కోసం
అడుగడుగునా ముందుకు వేస్తుండగా
విలువైన సమాధానం ఎక్కడుందని
ప్రతిచోట ఆశతో వెదకుచుండగా
శాంతి సమాధానం మనకివ్వగా
లోకాన ఏతెంచెను
నెమ్మది వచ్చింది సంతోషం వచ్చింది
రక్షణ వచ్చింది నిత్యజీవం వచ్చింది
rando raarando yesuni choodaganu
rando raarando prabhuyesuni cheraganu
paramunu vidichi dhiviki vachi lokaanni rakshinchenu
pasuvula thottilo dheenudai manalanu hechichenu
aaraadhiddhaamaa aanandhiddhaama
arbhaatiddhaamaa yesuni anusariddhaama
bhuvilona prathi manishi rakshana kosam
kanuletthi aakaasam choosthunndagaa
akkadundhi ikkadundhi rakshana antu
parugetthi parugetthi alasiyundagaa
lokaanni rakshimpa pasibaaludai
mana madhya nivasinchenu
maargam yesayye sathyam yesayye
jeevam yesayye naa sarvam yesayye
guri leni brathukulo gamyam kosam
adugadugunaa mundhuku vesthunndagaa
viluvaina samaadhaanam ekkadundhani
prathi chota aasatho vedhakuchundagaa
shanthi samaadhaanam manakivvagaa
lokaana yethenchenu
nemmadhi vachindi santhosham vachindi
rakshana vachindi nithya jeevam vachindi