సమాధిని గెల్చెను – సజీవుడై లేచెను
సాతానుని జయించెను – మరణపు ముల్లును విరిచెను (2)
క్రీస్తు లేచెను హల్లేలూయ క్రీస్తు నేడు లేచెను
క్రీస్తు లేచెను హల్లేలూయ పునరుద్ధానుడై లేచెను
కలువరిగిరిలో సిలువొందెను – తన రక్తమును చిందించెను
పాప క్షమాపణ మనకిచ్చెను – బహు వేదననే తను పొందెను (2)
బహు వేదననే తను పొందెను ||క్రీస్తు లేచెను||
మరణమా నీ ముల్లెక్కడా! మరణమా నీ జయమెక్కడ
మరణమా నీ ముల్లు విరిగెను – లేఖనములు నెరవేరెను (2)
లేఖనములు నెరవేరెను ||క్రీస్తు లేచెను||
Samaadhini Gelchenu – sajeevudai lechenu
saathanuni jayinchenu – maranapu mullunu virichenu (2)
Kreesthu lechenu hallelujah kreesthu nedu lechenu
Kreesthu lechenu hallelujah punaruddhanudai lechenu
Kaluvarigirilo siluvondhenu – thana rakthamunu chindinchenu
paapa kshamaapana manakichenu – bahu vedhanane thanu pondhenu (2)
bahu vedhanane thanu pondhenu ||Kreesthu||
Maranamaa nee mullekkada! maranamaa nee jayamekkada
maranamaa nee mullu virigenu – lekanamulu neraverenu (2)
lekanamulu neraverenu ||Kreesthu||