సంబరమాయె బేత్లెహేములో
సందడియాయె పశులపాకలో /2/
నీతిమంతుడు సర్వశక్తునిగా లోకరక్షకునిగా..
యేసు అవతరించెను
లోక రక్షకునిగా క్రీస్తు ఉదయించెను /సంబర/
దూత చెప్పిన వార్తతో యేసును చూడవెళ్లే గొల్లలు /2/
రక్షకుడేసు పుట్టాడని – క్రీస్తే వెలుగుగ వచ్చాడని /2/
రక్షణ మనకు తెచ్చాడని…
పరుగున వెళ్లారు – యేసును చూచారు
పాటలు పాడారు – నాట్యం చేశారు /2/సంబర/
తార చూపిన దారిలో – యేసుని చూడవెళ్ళే గొల్లలు /2/
యూదుల రాజుని చూడాలని
భక్తితో యేసుని మ్రొక్కాలని /2/
త్వరపడి యేసుని చేరాలని..
వేగమె వెళ్లారు – యేసుని చూచారు
కానుక లిచ్చారు – యేసుని పూజించారు /2/సంబర/
Sambaramaaye betlehemulo…
Sandadiyaaye pashulapaakalo /2/
Neetimandudu sarva shaktunigaa lokarakshakunigaa..
Yesu avatarinchenu
Loka rakshakunigaa Kreestu vudayinchenu /Sambara/
Doota cheppina vaarthato Yesunu choodavelle gollalu /2/
Rakshakudesu puttaadani – Kreeste veluguga vachhadani /2/
Rakshana manaku techhadani..
Paruguna vellaru – Yesunu choochaaru
Paatalu paadaaru – Naatyam chesaaru /2/Sambara/
Taara choopina daarilo – Yesunu choodavelle Gollalu /2/
Yoodula raajuni choodaalani
Bhakthito Yesuni mrokkaalani /2/
Twarapadi Yesuni cheraalani..
Vegme vellaaru – Yesuni choochaaru
Kaanukalichhaaru – Yesunu poojinchaaru /2/Sambara/