సిలువే నా శరనాయెను రా – నీ – సిలువే నా శర నాయెను రా
సిలువ యందె ముక్తి బలముఁ – జూచితి రా /నీ సిలువే /
సిలువను వ్రాలి యేసు – పలికిన పలుకు లందు
విలువలేని ప్రేమామృతముఁ గ్రోలితి రా /నీ సిలువే /
సిలువను జూచుకొలఁది – శిలాసమానమైన మనసు
నలిగి కరిగి నీరగుచున్నది రా /నీ సిలువే /
సిలువను దరచి తరచితి – విలువ కందగ రాని నీ కృప
కలుషమెల్లను బాపఁగఁ జాలును రా /నీ సిలువే /
పలు విధ పధము లరసి – ఫలిత మేమి గానలేక
సిలువయెదుటను నిలచినాడను రా /నీ సిలువే /
శరణు యేసు శరణు శరణు – శరణు శరణు నా ప్రభువా
దురిత దూరుఁడ నీ దరిఁ జేరితి రా /నీ సిలువే /
Siluve naa saranaayenu ra – nee – siluve naa sara naayenuraa
Siluva yande mukti balamun – joochiti raa /nee siluve/
Siluvanu vraali Yesu – Palikina palukulandu
Viluvaleni premaamrutamun groliti raa /nee siluve/
Siluvanu joochukoladi – Silasamaanamaina manasu
Naligi karigi neeraguchunnadiraa.. /nee siluve/
Siluvanu darachi tarachiti – Viluva kandaga raani nee krupa
Kalushamellanu baapaga jaalunu raa /Nee siluve/
Palu vidha padhamu larasi – Phalitamemi gaana leka
Siluva yedutanu nilachinaadanu raa / Nee siluve/
Sharanu Yesu sharanu sharanu – sharanu sharanu naa prabhuva
Durita dooruda nee dari jeriti rua / Nee siluve/