Thama dhaevuneruguvaaru తమ దేవునెరుగువారు

తమ దేవునెరుగువారు చేసెదరు – శక్తితో గొప్ప కార్యములు

ఇచ్చకపు మాటల వలన – అక్షయుని విడువరు
తప్పుబోధల నెపుడు తృణీకరించెదరు

సత్యమును విడువరు – ఉత్తములుగ నడిచెదరు
అతల్యాను హతము చేసెదరు శుద్ధులై యుండెదరు

మనుజ భయము జెందరు – మాన్యులై యుండెదరు
మంచి సాక్షమును విడువరు ఏకాంతులు కారు

ద్వేషించెదరు విగ్రహముల్ – శిరములు ఖండించినను
పర్వతమువలె కదలక వారు స్థిరముగ నుండెదరు

అగ్నిలో వేయబడినను – విఘ్నంబులు కలిగినను
సింహపు బోనులో వేసినను సిగ్గునొందరు

శోధనలను జయించెదరు – బాధలను సహించెదరు
నాథుడేసుని సదా వెదకి సాధించి ప్రకటింతురు

అదిక జ్ఞానమును పొంది – తగ్గించె కొనెదరు తామే
యేసు ప్రభువును హెచ్చించెదరు హల్లెలూయ పాడెదరు


thama dhaevuneruguvaaru chaesedharu
shakthithoa goppa kaaryamulu

ichchakapu maatala valana – akShyuni viduvaru
thappuboaDhala nepudu thruNeekariMchedharu

sathyamunu viduvaru – uththamuluga nadichedharu
athalyaanu hathamu chaesedharu shudhDhulai yuMdedharu

manuja bhayamu jeMdharu – maanyulai yuMdedharu
mMchi saakShmunu viduvaru aekaaMthulu kaaru

dhvaeShiMchedharu vigrahamul – shiramulu khMdiMchinanu
parvathamuvale kadhalaka vaaru sThiramuga nuMdedharu

agniloa vaeyabadinanu – vighnMbulu kaliginanu
siMhapu boanuloa vaesinanu siggunoMdharu

shoaDhanalanu jayiMchedharu – baaDhalanu sahiMchedharu
naaThudaesuni sadhaa vedhaki saaDhiMchi prakatiMthuru

adhika jnYaanamunu poMdhi – thaggiMche konedharu thaamae
yaesu prabhuvunu hechchiMchedharu hallelooya paadedharu


Posted

in

by

Tags: