Thana raajyamunaku mahimaku తన రాజ్యమునకు మహిమకు

తన రాజ్యమునకు మహిమకు పిలచిన – 2
మన ప్రభువుకు తగినట్టు నడిచెదము
తన రాజ్యములో మనము చేరెదము

కారుచీకటి కమ్మినను – యేసుని వెలుగులో నడిచెదము – 2
మంచి కాపరి మనతోనుండగ – తనతో ముందుకే సాగెదము – 2

ఇరుకు మార్గపు ఇబ్బందులలో – సిలువను మోయుచు వెళ్ళెదము
యేసే మనదు భారము మోయుచు – మనకు మార్గము చూపును

ఉప్పొంగుచున్న ఉపద్రవములలో – ఉన్నవాడనని ప్రభువనెను
అంతము వరకు చెంత నిలిచి – తానే మనతో నడచును

దారితొలగక గురి యొద్దకే – యేసునే చూచి నడచెదము
ఇహమున శుద్ధులై నడచువారే – పరమున ప్రభువుతో సంచరించెదరు

విశ్వాసమును విడువక – మంచి పోరాటం పోరాడి
ప్రభువుతో నడచి పరుగు ముగించి – నీతి కిరీటము పొందెదము


Thana raajyamunaku mahimaku pilachina – 2
mana prabhuvuku thaginattu nadichedhamu
thana raajyamuloa manamu chaeredhamu

kaarucheekati kamminanu – yaesuni veluguloa nadichedhamu – 2
mMchi kaapari manathoanuMdaga
thanathoa muMdhukae saagedhamu – 2

iruku maargapu ibbMdhulaloa – siluvanu moayuchu veLLedhamu
yaesae manadhu bhaaramu moayuchu – manaku maargamu choopunu

uppoMguchunna upadhravamulaloa – unnavaadanani prabhuvanenu
aMthamu varaku cheMtha nilichi – thaanae manathoa nadachunu

dhaaritholagaka guri yodhdhakae
yaesunae choochi nadachedhamu
ihamuna shudhDhulai nadachuvaarae
paramuna prabhuvuthoa sMchariMchedharu

vishvaasamunu viduvaka – mMchi poaraatM poaraadi
prabhuvuthoa nadachi parugu mugiMchi – neethi kireetamu poMdhedhamu


Posted

in

by

Tags: