ఉదయ కాంతి రేఖలో – బెత్లెహేము పురమున
అవతరించెను బాల యేసు – పాపాలు మోయు గొర్రె పిల్ల
పాపాలు మోయు గొర్రె పిల్ల
పరమ పుత్రుని మోహన రూపుగని – తల్లి మరియ మురిసే
బాల యేసుని మహిమ రూపు – ఈ జగానికి వెలుగై
గొల్లలు జ్ఞానులు పరిశుద్దులు – ప్రస్తుతించిరి బాల యేసుని /ఉదయ/
ఆకాశ తారల మెరుపు కాంతిలో – ప్రక్రుతి రాగాల స్వరాలతో
హల్లెలూయ యని పాడుచు – దూత గణము స్తుతించిరి
జగ మొక ఊయలగా చేసి – దూతలు పాడిరి జోల పాట /ఉదయ/
Udaya kanti rekhalo – Betlehemu Puramuna
Avatarinchenu baala Yesu – Paapaalu moyu gorre pilla
Paapaalu moyu gorre pilla
Parama putruni mohana roopugani – Talli mariya murise
Baala Yesuni Mahima roopu – Ee jagaaniki valugai
Gollalu jnaanulu parishuddhulu – Prastutinchiri baala Yesuni / Udaya/
Akasha taarala merupu kaantilo – Prakruti raagaala swaraalato
Halleluya ani paaduchu – Doota ganamu stutinchiri
Jagamoka Vuyalagaa chesi – Dootalu paadiri jola paata / Udaya/