వెలిగింది గగనం ఒక వింత తారతో
మురిసింది భువనం ప్రభు యేసు రాకతో /2/
పులకించె ప్రకృతి-పలికించె ప్రస్తుతి /2/వెలిగింది/
హ్యేపి హ్యేపి క్రీస్మస్-మేర్రీ మేర్రీ క్రిస్మస్ /2/
రాజుల రాజు ప్రభువుల ప్రభువు భూవికేతెంచెనని
భూజనులకు బహుమానముగా-ఇలలో జనియించెనని /2/
పరమ్మోన్నతుని ప్రసన్నత-ఈ జగతిలో నిండెనని /2/
వరసుతుడేసుని నవ్వుతో పశువుల పాకయే పండెనని /2/వెలిగింది
దీనులకాచే దైవకుమారుడు పరమును వీడెనని
ముష్యుకుమారుడై కన్య మరియ ఒడిలో పరుండెనని /2/
పాపుల బ్రోచే రక్షకుడు యేసయ్యగ వచ్చెనని /2/
కాపుదలిచ్చే ఇమ్మానుయేలు వెలుగును తెచ్చెనని /2/వెలిగింది/
Velegindi gaganam – Oka vinta taarato
Murisindi bhuvanam – Prabhu yesu raakato /2/
Pulakinche prakruti – Palikinche prastuti /2/Veligindi/
happy happy Christmas – Merry Merry Christmas /2/
Raajula raaju prabhuvula prabhuvu bhuviketenchenani
Bhujanulaku bahumaanamuga – Ilalo Janiyinchenani /2/
Pramonnatuni prasannata – Ee jagatilo nindenani /2/
Varasutudesuni navvuto prashuvula paakaye pandenani /2/Veli/
Deenulakaache Daivakumaarudu – Paramunu veedenani
Manushyakumaarudai – Kanya mariya odilo parundenani /2/
Paapula broche rakshakudu – Yesayyaga vachhenani /2/
Kaapudalichhe Immanuyelu – Velugunu techhenani /2/Veli/