Vinnara janulara విన్నారా జనులారా

విన్నారా జనులారా ఈ వార్త శుభవార్త /2/
యేసయ్య జన్మించాడు – రక్షకుడుదయించి నాడు! /2/
బేత్లెహేములో పశులపాకలో
కన్యమరియ – గర్భమందున /2/
రారాజు జన్మించినాడు మనకై భువికొచ్చినాడు /2/

“సర్వశక్తిగల యేసుదేవుడు – సమస్తము చేయగల దేవుడు
పరలోకభాగ్యము వీడి – దీనునిగా భువికొచ్చినాడు” /2/
పాపమెరుగని పావనాత్ముడు
పరిశుద్ధులలో అతి శ్రేష్ఠుడు /2/యేసయ్య/విన్నారా/

పాపులకై వచ్చిన దేవుడు – ప్రేమించి కరుణించే దేవుడు
అంధకారమైన జీవితాలకు – వెలుగుగా ఉదయించినాడు
(మన) పాపదోషము పరిహరింపను – పరిశుద్ధులుగా మనల చేయను /2/యేసయ్య/విన్నారా/


Vinnaara janulaara – ee vaartha shubha vaartha! /2/
Yesayya janminchinaadu – Rakshakududayinchinaadu! /2/
Betlehemulo – pashulapaakalo
Kanya Mariya – garbhamanduna /2/
Raaraaju janminchinaadu – manakai bhuvikochhinaadu /2/

Sarvashakthi gala Yesu devudu – samasthamu cheyagala devudu
Paraloka bhaagyamu veedi – Deenunigaa bhuvikochhinaadu /2/
Paapamerugani – paavanaatmudu
Parishuddhulalo ati sreshtudu /2/Yesayya/vinnara/

Paapulakai vachhina devudu – preminchi karuninche devudu
Andhakaaramaina jeevitaalaku – veluguga vudayinchinaadu
(mana) Paapadoshamu praiharimpanu – Parishuddhuluga manala cheyanu /2/Yesayya/vinnara/


Posted

in

by

Tags: