Yaajaka dharmamu యాజక ధర్మము

యాజక ధర్మము నెరిగి – యేసునికే సేవ ప్రేమతో నొనరింపుడు

ఆది ప్రధాన యాజకు డహరోను ప్రభునికే ముంగురుతు
అతని కుమారులు విశ్వాసులకు ప్రాపుగ ముంగురుతు

ప్రధాన యాజకుడు మనయేసే – యాజకులము మనమే
పరమ పిలుపులో నిలిచినవారే స్థిరముగ నుండెదరు

నాదాబు యనగా మనసున్నవాడని – అబీహువు నా తండ్రి
ఎలియేజరనగ దేవుడు నా బలము ఈతామారు ఖర్జూర భూమి

అహరోను ధరించిన వస్త్రములేడు – వాని యర్ధమేమి
ప్రభుయేసు వాని యందున్న వాడు రక్షింపబడిన వారును

పతకము, ఏఫోదు, విచిత్రమైన దట్టీ – నిలువుటంగీ, పాగ
మేలిమి బంగరు రేకు, విచిత్ర – మైన చొక్కా ఏడును

ఆయనతోడ వేయి వత్సరములు ఆనందముతో నేలుచు
యాజకులందరు భాగ్యశాలులై హల్లెలూయ పాడెదరు


Yaajaka dharmamu nerigi
yaesunikae saeva praemathoa nonarimpudu

Aadhi pradhaana yaajaku daharoanu prabhunikae munguruthu
athani kumaarulu vishvaasulaku praapuga munguruthu

Pradhaana yaajakudu manayaesae
yaajakulamu manamae
parama pilupuloa nilichinavaarae
sthiramuga nundedharu

Naadhaabu yanagaa manasunnavaadani
abeehuvu naa thandri
eliyaejaranaga dhaevudu naa balamu
eethaamaaru kharjoora bhoomi

Aharoanu dharinchina vasthramulaedu
vaani yardhamaemi
prabhuyaesu vaani yundhunna vaadu
rakshimpabadina vaarunu

Pathakamu, aephoadhu, vichithramaina dhattee
niluvutangee, paag
maelimi bangaru raeku, vichithra
maina chokkaa aedunu

Aayanathoada vaeyi vathsaramulu
aanandhamutho naeluchu
yaajakulandharu bhaagyashaalulai
hallelooya paadedharu


Posted

in

by

Tags: