యెహోవా సేవకులారా స్తుతించుడి
ఆయన నామమును స్తుతించుడి
యెహోవా మందిర ఆవరణములలో
నిలుచుండు వారలారా మీరు
యెహోవా దయాళుడు ఆయన నామమును
కీర్తించుడి అది మనోహరము
యాకోబును తనకొర కేర్పరచుకొని
ఇశ్రాయేలును స్వకీయ ధనముగా కొనెన్
యెహోవా సకల దేవతల కంటెను
గొప్పవాడని నేనెరుంగుదున్
భూమ్యాకాశములు మహా సముద్రము
లందాయన కిష్టమైనవి చేసెను
భూమి దిగంతముల నుండి ఆవిరి
లేవజేసి వాన కురియునట్లు
మెరుపును పుట్టించి తన నిధులలో నుండి
గాలిని బయలు వెళ్ళఁజేయు వాడాయనే
ఐగుప్తు జనుల తొలిచూలులను
పశువుల తొలిచూలుల జంపెను
ఫరో యెదుట వాని ఉద్యోగుల యెదుట
సూచనల మహాత్కార్యముల జేసె
అన్యులనేకులను శక్తిగల
రాజులనేకులను చంపెను
అమోరీయుల రాజైన సీహోనును
బాషాను రాజగు ఓగును చంపెను
కనాను రాజ్యముల పాడుచేసియు
నిశ్రాయేలేయుల కప్పగించెను
యెహోవా నీ నామము నిత్యముండున్
నీ జ్ఞాపకార్థము తర తరములకును
యెహోవా తనదగు ప్రజలకు తానే
న్యాయము తీర్చును హల్లెలూయ
తన వారగు తన సేవకులను బట్టి
సంతాపము నొందు నాయనల్లేలూయ
Yehoavaa saevakulaaraa sthuthinchudi
aayana naamamunu sthuthinchudi
Yehoavaa mandhira aavaranamulaloa
niluchundu vaaralaaraa meeru
Yehoavaa dhayaaLudu aayana naamamunu
keerthinchudi adhi manoaharamu
yaakoabunu thanakora kaerparachukoni
ishraayaelunu svakeeya dhanamugaa konen
yehoavaa sakala dhaevathala kantenu
goppavaadani naenerungudhun
bhoomyaakaashamulu mahaa samudhramu
landhaayana kishtamainavi chaesenu
Bhoomi dhiganthamula nundi aaviri
laevajaesi vaana kuriyunatlu
merupunu puttinchi thana nidhulaloa nundi
gaalini bayalu velljaeyu vaadaayanae
Aigupthu janula tholichoolulanu
pashuvula tholichoolula jampenu
pharoa yedhuta vaani udhyoagula yedhut
soochanala mahaathkaaryamula jaese
Anyulanaekulanu shakthigal
raajulanaekulanu champenu
amoareeyula raajaina seehoanunu
baashaanu raajagu oagunu champenu
Kanaanu raajyamula paaduchaesiyu
nishraayaelaeyula kappaginchenu
yehoavaa nee naamamu nithyamundun
nee jnyaapakaarthamu thara tharamulakunu
Yehoavaa thanadhagu prajalaku thaanae
nyaayamu theerchunu hallelooy
thana vaaragu thana saevakulanu batti
santhaapamu nondhu naayanallaelooy