యెహోవాయె మనకందరికి – ఎన్నియో మేలుల జేసెన్
తన కృప కనికరముల్ – స్మరియించి స్తుతించెదము
మనమాయన జనము – ఆయన సంతతియు
సిలువ మరణముద్వారా మనకు – తనదు జీవమునిచ్చె
ఎంత అద్భుత రక్షకుడు
అడుగువాటికంటె – అధికముగ నిచ్చె
తన నిబంధనను స్థిరపరచి – తన వాక్కులు నెరవేర్చె
మాట తప్పనివాడవు
కష్టదుఃఖములందు – పాలివాడాయె
ప్రేమనుజూపి ప్రభువే మనల – తన రెక్కలపైమోపె
మనతో నుండును నిరతము
ఎన్నిసార్లు ప్రభుని – దుఃఖపరచితిమి
అయినను ప్రభువే తన దయజూపి
మనలన్ క్షమియించెనుగా – ప్రేమగల మా తండ్రివి
నీవే మా దుర్గమును – కేడెము నీవే
నిన్నుమేము నమ్మియున్నాము – మాకు సర్వము నీవే
మేము నీదు ప్రజలము
Yehoavaaye manakandhariki – enniyoa maelula jaesen
thana krupa kanikaramul – smariyinchi sthuthinchedhamu
Manamaayana janamu – aayana santhathiyu
siluva maranamudhvaaraa manaku – thanadhu jeevamunichche
entha adhbhutha rakshkudu
Aduguvaatikante – adhikamuga nichche
thana nibandhananu sthiraparachi – thana vaakkulu neravaerche
maata thappanivaadavu
Kashtadhuhkhamulmdhu – paalivaadaaye
praemanujoopi prabhuvae manala – thana rekkalapaimoape
manathoa nundunu nirathamu
Ennisaarlu prabhuni – dhuhkhaparachithimi
ayinanu prabhuvae thana dhayajoopi
manalan kshmiyimchenugaa – praemagala maa thandrivi
Neevae maa dhurgamunu – kaedemu neevae
ninnumaemu nammiyunnaamu – maaku sarvamu neevae
maemu needhu prajalamu